Saturday, December 6, 2008

మహాప్రవక్త-౩

బిస్మిల్లా హిర్రహ్మ నిర్రహీమ్

ఇదం జనా ఉపశ్రుత నరాశం సస్తవిష్యతే
షష్టిం సహస్రానవతిం చ కౌరమ్ ఆ
రుశమేషు దబ్మ హే

ఉష్ట్ర్రా యస్య ప్రవాహీణో వధూమన్తో ద్విర్ధశ
వర్షమా రధస్యని జిహీడతే దివ
ఈషమాణా ఉప స్ప్రృశః

ఏష ఇషాయ మా మహే శతం నిష్కాన్ దశ స్రజః
త్రీణి శతాన్య ర్వతాం సహస్రా దశ గోనమ్

(ఆధర్వణ్ వేదం -౨౦ వ కాండం ,౧౨౭వ సూక్త, ౧-౩ వ మంత్రం)

’ఓ భక్తులారా ! ఈ ప్రభొధకుని మాటలు వినండి.......
ప్రశంసనీయుడూ ,ప్రశంసింపబడినవాడూ అయిన ఆ మహార్షి ౬౦౦౯౦ మంది మనుషుల మధ్య జననమొందుతాడు".


(మహమ్మద్ అంటేనే ప్రశంసనీయులు,ప్రశంసింప తగిన లక్షణములు గల వ్యక్తి, ఆయన జన్మించేనాటికి మక్కా నగర జనాభా సంఖ్య ౬౦ వేలు).

'ఆయన ఇరవై ఆడ ,మగ ఒంటేల మీద సవారీ చేస్తారు. అమోఘమయిన వారి కీర్తి స్వర్గలోకం దాకా పాకుతుంది.ఈ మహర్షి ౧౦౦ బంగారు నాణెములు కలిగి ఉంటారు’.

(ఒంటెల మీద పయనించె మహర్షులు మన భరతఖండంలొ కనిపించరు.అందుచేత ఆది మహమ్మద్ ప్రవక్తను ఉద్దేశించి రాసిన మాటలై వుంటాయి.౧౦౦ బంగారు నానేములు -అరేబియా వదలి అబిసినియాకు వలస వేళ్ళిన ౧౦౦ మంది శిష్యులని అర్ధం.)

మహప్రవక్తను విశ్వ కారుణ్య స్వరుపుడుగా "పవిత్ర దివ్య ఖురాన్ "నిర్వచిస్తున్నది.

మహాప్రవక్త-2

బిస్మిల్లా హిర్రహ్మా నిర్రహీమ్

లింగచ్చేది శిఖాహీనః శ్మశ్రుధారిస ధూషకః
ఉచ్చలాపీ సర్వభక్షి భవిష్యతి జనోమమ
.....................................
..............
ముసలైనైన సంస్కారః.................
(భాగం : ఖండం : ౩ ఆధ్యాయం ౩ : శ్లొకం : ౨౫-౨౭)
ఆయన (ప్రవక్త మహమద్) "లింగచ్చేధి "-అంటే సున్నతి చేయించుకున్న వాడయి వుంటారు.తలపైన ముడివుండదు,మాంసాహారి అయివుంటారు.గడ్డం పెంచుకుని వుంటారు.బిగ్గరగా గొంతెత్తి మాట్లాడుతారు.
"ముసలై" అని పరిచయం చేయబడుతారు అని పురాణం చెబుతూంది.

మరోసారి మళ్ళి చదవి చూస్తే అతిముఖ్యమైన విషయం ఒకటి కనిపిస్తుంది.

లింగచ్చేది--సున్నతి --అన్నది హిందూ మతంలో లేదు.
తల మీద ముడి అన్నది హిందూమతంలో తప్పకూండా వుండాలి. కాని "శిఖాహీనః" శిరోముండనము చేయించుకున్న వాడు అన్నది స్పష్టంగా చెప్పబడింది.
వీటన్నిటికంటే ఆశ్చర్యమైన మాట "ముసలై" అన్నది

ముస్లిమ్ ,ముసల్మాన్ అనువారికి ’ముసలై’ అన్న పదం ఆపాదించి చూడండి.

ఇవ్వే కాదు ...... మహాప్రవక్త జీవితం గురించి కూడా చెప్పి ఉన్న మాటలు- ఆయన ఎలా ఉండేవారు తరువాతి టపాలొ........

Friday, December 5, 2008

మహా ప్రవక్త

బిస్మిల్లా హిర్రహ్మా నిర్రహీమ్

మహాప్రవక్త మహమ్మద్ గారి రాక గురించి కోన్ని వేల సంవత్సరాల క్రితం హైందవ మతం లొని వేదాలలొ ముందుగానే రాసి ఉన్నారని ఒక్క పండితుడు అనగా,ఆది విని ఆ విషయం తెలుసుకోవాలన్న కోరిక నాకు కలిగింది.

ఆ విషయాల గిరించి శొదన ప్రారంభించాను ఆయన చెప్పినదాంట్లో నిజం ఉంది అన్నది తెలుసుకుని నేను అశ్చర్యపోయాను.
వ్యాస మహర్షిచే వ్రాయబడినవి అని చెప్పబడుతున్న పద్దెనిమిది పురాణాల్లో ఒక్కటైన భవిష్యత్ పురాణంలొని ఒకటొ సూత్రాన్ని ఈ క్రింద వ్రాస్తున్నాను (వ్యాకరణలొ తప్పు లుంటే క్షమించండి).

ఎతన్ మిన్నన్తరే మ్లేచ్చ ఆచార్యేణ సమన్వితః
మహమద ఇతిఖ్యాతః శిష్య శాఖా సమన్వితః
నృవ శ్చైవ మహాదేవం మరుస్ద్గల నివాసినమ్...............
(భవిష్యపురాణం - పర్వం : 3 ఖండం :౩ అద్యాయం :౩ శ్లోకం: ౫-౮)

ఒక మ్లేచ్చుడు ,పరాయి దేశస్ధుడయిన ఒక ప్రభోధకుడు తన శిష్యులతో పాటు వస్తాడు. అయన పేరు మహమద్ .ఆయన ఎడారి ప్రదేశానికి చేందిన వారాయివుంటారు.
మహమద-ముహమ్మద్
అతి స్పష్టంగా ,సూటిగా పేరూ ,రాబోయే వ్యక్తి నివాసమూ చెప్పబడినది అంటే .అది అద్బుతం.

ఆ మహప్రవక్త గుణగణాదుల గూర్చి అదే పురాణం లొ చేపుతున్నది తరువారి టపాలొ.

Wednesday, December 3, 2008

బిస్మిల్లా హిర్రహ్మ నిర్రహీమ్

బిస్మిల్లా హిర్రహ్మ నిర్రహీమ్.

నేటి సమాజంలో చాలా వరకు ఇస్లామ్ మతం మీద అపోహలు ఉన్నాయి.

అపొహలు అనేకంటే అపార్ధలని అనవచ్చు.
తీవ్రవాదులు చేస్తున్నా అహింసని ఏ ముస్లిమ్ సొదరుడు హర్షించడు.

ఇస్లామ్ లో ఎక్కడ అమయకులను చంపమని లేదు.
ప్రతి ముస్లిమ్ శాంతితొ,జాలి,దయతో ప్రేమతో సహజీవనం సాగించాలని పవిత్ర ఖురాన్ అంటుంది, బొదిస్తుంది.

కోందరు ముస్లిమ్ సైతాను ల వల్ల ఈ రోజు ఇస్లామ్ ముస్లిమేతరులకు చాలా చాలా దూరం అవడం కడు శొచనీయం.


నేను ఇస్లామ్ గోప్పదనం గురించి చేప్పదలుచు కొలేదు
ఇస్లామ్ మతం మీద ముస్లిమేతరులకు ఉన్న అపోహలను చాలా వరకు దూరం చేయడానికే నా ఈ ప్రయత్నం
.