Saturday, December 6, 2008

మహాప్రవక్త-2

బిస్మిల్లా హిర్రహ్మా నిర్రహీమ్

లింగచ్చేది శిఖాహీనః శ్మశ్రుధారిస ధూషకః
ఉచ్చలాపీ సర్వభక్షి భవిష్యతి జనోమమ
.....................................
..............
ముసలైనైన సంస్కారః.................
(భాగం : ఖండం : ౩ ఆధ్యాయం ౩ : శ్లొకం : ౨౫-౨౭)
ఆయన (ప్రవక్త మహమద్) "లింగచ్చేధి "-అంటే సున్నతి చేయించుకున్న వాడయి వుంటారు.తలపైన ముడివుండదు,మాంసాహారి అయివుంటారు.గడ్డం పెంచుకుని వుంటారు.బిగ్గరగా గొంతెత్తి మాట్లాడుతారు.
"ముసలై" అని పరిచయం చేయబడుతారు అని పురాణం చెబుతూంది.

మరోసారి మళ్ళి చదవి చూస్తే అతిముఖ్యమైన విషయం ఒకటి కనిపిస్తుంది.

లింగచ్చేది--సున్నతి --అన్నది హిందూ మతంలో లేదు.
తల మీద ముడి అన్నది హిందూమతంలో తప్పకూండా వుండాలి. కాని "శిఖాహీనః" శిరోముండనము చేయించుకున్న వాడు అన్నది స్పష్టంగా చెప్పబడింది.
వీటన్నిటికంటే ఆశ్చర్యమైన మాట "ముసలై" అన్నది

ముస్లిమ్ ,ముసల్మాన్ అనువారికి ’ముసలై’ అన్న పదం ఆపాదించి చూడండి.

ఇవ్వే కాదు ...... మహాప్రవక్త జీవితం గురించి కూడా చెప్పి ఉన్న మాటలు- ఆయన ఎలా ఉండేవారు తరువాతి టపాలొ........

No comments: